ఓట్ల లెక్కింపు రోజు.. ముహూర్తం ఎలా ఉంది.. తిధి, నక్షత్రం

ఓట్ల లెక్కింపు రోజు.. ముహూర్తం ఎలా ఉంది.. తిధి, నక్షత్రం

తెలంగాణలో ఎన్నికల సంగ్రామంలో చివరి అంకానికి చేరింది.  రేపు ( డిసెంబర్​ 3)న తెలంగాణ కింగ్​ ఎవరో తెలిపోనుంది.  అయితే ఆరోజు ( డిసెంబర్​ 3)   తిథి వార నక్షత్రాలు ఎలా ఉన్నాయి..  అన్నీ పార్టీల బడా నేతలు ఆరోజు  వారికి ఎంతవరకు  అనుకూలం.. ఎంతమేరకు ప్రతికూలం అనే విషయాలను సంఖ్యా శాస్త్ర నిపుణులను సంప్రదిస్తున్నారు.  అసలు రేపు ( డిసెంబర్​ 3) తిథి, వార,  నక్షత్రం  మొదలగు వివరాలను తెలుసుకుందాం. . .. 

 డిసెంబర్ 3 , 2023 పంచాంగ వివరాలు 

  • శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 
  • దక్షిణాయణం
  • కృష్ణ పక్షము శరత్ ఋతువు
  • తిథి:  షష్టి 17:14 వరకు
  • నక్షత్రం : ఆశ్లేష 18:54 వరకు
  •  మాసం: కార్తీక మాసం
  • అమృతకాలము: 07‌‌49  నుండి 03–36 వరకు
  • సూర్యోదయము: 06:31
  • సూర్యాస్తమయము: 17:40
  • రాహు కాలం: సాయంత్రం 4:13  నుండి  సాయంత్రం 5:36 వరకు
  • యమగండము: మధ్యాహ్నం 12:05 నుండి 01:28 వరకు
  • దుర్ముహుర్తములు: ఉదయం 11:02 నుంచి  మధ్యాహ్నం 01:31 వరకు 
  • సాయంత్రం 04:08 నుండి  సాయంత్రం 04:52 వరకు, రాత్రి 07:15 నుండి  రాత్రి 08:00 వరకు
  • అభిజిత్:  ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు
  • కరణం:వనిజ   రాత్రి 06–17 వరకు
  • వర్జ్యం: ఉదయం 09:08 నుంచి ఉదయం 10:55 వరకు 
  • చంద్రోదయం: 10:08
  • గుళిక కాలం: 06:31 నుండి 07:54 వరకు
  • యోగా: బ్రహ్మ 20:19 వరకు

సంఖ్యా శాస్త్రం ప్రకారం సాధారణంగా  షష్టి తిథి రోజు  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.    రేపు  డిసెంబర్3న​ అశ్వని, కృత్తిక , మృగశిర, పునర్వసు, పుష్యమి,మఖ,ఉత్తర , చిత్త, విశాఖ,అనూరాధ, మూల, ఉత్తరాషాడ, ధనిష్ట,పూర్వభాధ్ర, ఉత్తరాబాధ్ర  నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉందని సంఖ్యాశాస్త్ర ప్రకారం తెలుస్తోంది.